RO-KO భవితవ్యంపై ప్రశ్నలెందుకు?: భజ్జీ
భారత స్టార్ క్రికెటర్స్ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడతారో లేదో ఇంకా స్పష్టతలేదు. ఈ క్రమంలో RO-KO భవితవ్యంపై ప్రశ్నలెందుకంటూ మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, కోహ్లీ భారత్ కోసం ఎంతో చేశారని, ఇప్పటికీ రాణిస్తున్నారని గుర్తు చేశాడు. అయితే వారు ఆడతారా లేదా అనేది ఎవరో డిసైడ్ చేయడం దురదృష్టకరమని, ఇలా తనతోపాటు ఎందరికో జరిగిందని పేర్కొన్నాడు.