'ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి'
PDPL: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం డిమాండ్ చేశారు. ప్రైవేట్ డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు చేపట్టిన నిరవధిక బంద్‌కు మద్దతు తెలుపుతూ ఆయన నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని, కళాశాలలు బంద్ చేసినా ప్రభుత్వం మౌనం వహించడం సరికాదని పేర్కొన్నారు.