ఈనెల 13న గన్నవరంలో పర్యటంచనున్న సీఎం
కృష్ణా: ఈనెల 13న సీఎం చంద్రబాబు గన్నవరంలో పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభవ నిధులను PM-KISAN పథకంతో కలిపి విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గన్నవరంలో జరిగే కార్యక్రమంలో 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,808 కోట్లు నేరుగా CM జమ చేయనున్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.