విశాఖలో రికవరీ మేళా
విశాఖపట్నంలో మార్చి నెలలో నమోదైన ఆస్తి నేరాల్లో 67 కేసులను పోలీసులు ఛేదించి 83 మందిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రూ.1.12 కోట్ల విలువైన సొత్తుతో పాటు 312 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. CEIR ద్వారా 303 మొబైళ్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. నగరంలో సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణతో నేరాల నియంత్రణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.