'మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్‌పై విస్తృత అవగాహన కల్పించాలి'

'మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్‌పై విస్తృత అవగాహన కల్పించాలి'

కర్నూలు: రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చేపట్టిన మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.