ప్రమాదంలో యువకుడి దుర్మరణం

NTR: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ పార్కింగ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తల నుజ్జునుజ్జై గుర్తు పట్టలేని విధంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని, నీలి రంగు టీ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.