సీడ్ క్యాపిటల్ లబ్ధిదారులకు శిక్షణ
PPM: సాలూరు వెలుగు కార్యాలయంలో ఏపీఎం అంపల్లి జయమ్మ ఆధ్వర్యంలో బుధవారం సీడ్ క్యాపిటల్ లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డిఆర్డిఏ జీవనోపాధులు ఏపీఎం రాణి రత్నకుమారి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించిన రుణం సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి రోజు అమ్మకాలు రికార్డులో నమోదు చేసి లాభ నష్టాలు ఎప్పటికప్పుడూ బేరీజు వేసుకొని వ్యాపారం చేయాలన్నారు.