'ప్లాన్ అప్రూవల్ రుసుము తగ్గించాలి'
KDP: బద్వేల్ మున్సిపాలిటీ 35 వార్డులలో పెంచిన ఇంటి పన్నులను, ప్లాన్ అప్రూవల్ రుసుములను తక్షణమే తగ్గించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఎం.ఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ మెంబర్ చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు జకరయ్యలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పెంచిన ఇంటి పన్నులను, ప్లాన్ అప్రూవల్ ఛార్జీలు తగ్గించాలని మున్సిపల్ మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు.