రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

GNTR: తుళ్లూరు మండలం దొండపాడులో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వైకుంఠపురం గ్రామానికి చెందిన గంగుల భాగ్య రాజు ద్విచక్ర వాహనంపై రెండు బస్తాల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి బియ్యంతో పాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.