శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వైభవం
NDL: శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకున్నారు. తెల్లవారుజామునే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరించారు. భక్తులు గంగాధర మండపం వద్ద, ఉత్తర మాడవీధిలో కార్తీక దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.