నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
NZB: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. మన ఊరు - మన భద్రత - మన బాధ్యత' కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి ఎడ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసుల పనితీరుతో సమానమని పేర్కొన్నారు.