పోలింగ్: 11 గంటలకు 28.38 శాతం నమోదు
సూర్యాపేట: జిల్లాలోని ఐదు పురపాలక సంఘాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 28.38 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా తిరుమలగిరిలో 37.13 శాతం, అత్యల్పంగా సూర్యాపేటలో 23.53 శాతం పోలింగ్ జరిగింది. ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరడంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది.