తాడేపల్లిగూడెంలో బార్ లైసెన్సులకు గడువు పెంపు

W.G: తాడేపల్లిగూడెంలో నాలుగు మద్యం బార్ల లైసెన్సుల దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించిందని ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. శనివారం ఆమె తాడేపల్లిగూడెంలో మాట్లాడారు. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్వరాజ్యలక్ష్మి కోరారు.