VIDEO: చెన్నూరు గురుకులంలో మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
MNCL: చెన్నూరు గురుకులంలో విద్యార్థిని చనిపోయి 10రోజులు కూడా దాటకముందే మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. స్థానికుల వివరాల ప్రకారం గురుకులంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని శనివారం హాస్టల్లోనే టాయిలెట్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈ క్రమంలో ఆమెను చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.