నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం

నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో 15, 16 వార్డులో శనివారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. సోముదేవునిపాలెం వాటర్ ప్రాజెక్టు వద్ద విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన కారణంగా నెహ్రూ నగర్, ద్వారకా నగర్, అగ్నిమాపక కాలనీ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగు నీటిని సరఫరా చేస్తామన్నారు.