ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థల పరిశీలన

NLG: దేవరకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఈ మేరకు ఎమ్మెల్యే బాలు నాయక్, కలెక్టర్ త్రిపాఠి అధికారులతో కలిసి పట్టణంలో ఇవాళ స్థల పరిశీలన జరిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీవో రమణా రెడ్డి పాల్గొన్నారు.