రాజాపూర్‌లో ఆటో బోల్తా.. టిఫిన్స్ ధ్వంసం
MBNR: రాజాపూర్ మండల కేంద్రంలో బ్రిడ్జి నిర్మాణ పనుల మధ్య గురువారం ఉదయం లారీ ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో కిందపడిపోయి అందులోని టిఫిన్స్ నేలపాలయ్యాయి. ఆటోకు కూడా నష్టం జరిగింది. ముందస్తు భద్రతా ఏర్పాట్లు లేకుండానే పనులు జరుగుతుండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.