వృద్ధురాలి మెడ లోంచి చైన్ స్నాచింగ్

WGL: పర్వతగిరి మండలం చింత నెక్కొండలో చైన్ స్నాచింగ్ పాల్పడ్డారు. సోమవారం స్వర్ణలత అనే 60 ఏళ్ల వృద్ధురాలు తన తోటలో పండించిన డ్రాగన్ ఫ్రూట్స్ రోడ్డు పక్కన పెట్టి అమ్ముతోంది. ఈ క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైకుపై వచ్చి మెడలోని 36గ్రా. పుస్తెలతాడును దొంగిలించారు. దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రవీణ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.