VIDEO: అనపర్తిలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు

VIDEO: అనపర్తిలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు

తూ.గో: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలో బుధవారం వైష్ణవక్షేత్రాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనపర్తి పాత ఊరులోని శ్రీదేవి భూదేవి సమేత జనార్ధన స్వామి ఆలయం, కెనాల్ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు, సహస్ర తులసి పూజలు చేశారు.