రంపచోడవరంలో తొలి గణతంత్ర వేడుకలకు సిద్ధం
ASR: నూతన పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరంలో ఈనెల 26న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక జూనియర్ కాలేజీలో జరగనున్న ఈ తొలి వేడుకల్లో పోలీస్ కవాతు, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని జేసీ బచ్చు స్మరణ్ రాజ్ తెలిపారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.