గ్రామం మధ్యలో నిలిచిపోయిన వరద నీరు

గ్రామం మధ్యలో నిలిచిపోయిన వరద నీరు

AKP: సబ్బవరం(M) పైడివాడ అగ్రహారంలో వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంచినీటి మోటార్ల నుంచి బురద నీరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో డ్రైనేజ్ కాలవలు లేకపోవడంతో గెడ్డ వాగుల నుంచి చెత్తా, చెదారంతో వచ్చిన నీరు బయటికి వెళ్లే అవకాశం లేక గ్రామం మధ్యలో నిలిచిపోయిందని పేర్కొన్నారు. అధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.