సాఫ్ట్ వేర్ జంట.. సేంద్రియ పంట

సాఫ్ట్ వేర్ జంట.. సేంద్రియ పంట

NLG: సాఫ్ట్ వేర్ ఉద్యోగులైన మహ్మద్ అజారూద్దీన్, షహానా పర్వీన్ దంపతులు రసాయన అవశేషాల్లేని ఆహారం పండించాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరు, HYDలో నాణ్యమైన ఆహారం దొరకకపోవడంతో ఆత్మకూర్(M) పాతసూర్యాపేట సమీపంలో 2022లో రూ.90 లక్షలతో 1.16 ఎకరాల భూమి కొన్నారు. ఇల్లు, బోరుబావి, సోలార్ ప్యానల్స్, దేశీ ఆవు, కోళ్ల షెడ్ వంటి వాటి కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి సహజసిద్ధంగా పంటలు పండిస్తున్నారు.