గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే

BDK: గ్రామాల్లో అధికారులు పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి. ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మంగళవారం ఇల్లందులో పలు శాఖలకు చెందిన అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు వర్షాల వల్ల దెబ్బతిన్న అంతర్గత, బీటీ రోడ్లను మరమ్మత్తులు చేయాలని పేర్కొన్నారు.