నిరసన పేరుతో రెచ్చిపోయిన ఖలిస్థానీలు

నిరసన పేరుతో రెచ్చిపోయిన ఖలిస్థానీలు

కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు రెచ్చిపోయారు. నిరసన పేరుతో ర్యాలీ నిర్వహించిన వారు, కెనడా నుంచి ఒక వర్గం వారిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో భారత ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జై శంకర్‌ల చిత్రాలను అభ్యంతరకరంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.