VIDEO: తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
KDP: పులివెందుల మండలం పుట్రాయునిపేటకు చెందిన శ్రీనివాసులరెడ్డి, సోమవారం గ్రామ సమీపంలోని తాటిచెట్టుపై నుంచి కాయలు కోస్తూ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి మృతి చెందాడు. ప్రతి ఏడాది తాటికాయలు కోసి విక్రయించే శ్రీనివాసులరెడ్డి మరణంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.