VIDEO: 'రైతన్న- మీకోసం'లో పాల్గొన్న మంత్రి సవిత
సత్యసాయి: గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలోని గుమ్మయ్యగారిపల్లిలో మంగళవారం మంత్రి సవిత పర్యటించారు. 'రైతన్న- మీకోసం' కార్యక్రమంలో భాగంగా మంత్రి రైతులతో సమావేశం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం & శాస్త్రీయ సాగుపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. శాస్త్రీయ సాగు, సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వంటి ఆధునిక వ్యవసాయ ప్రయోజనాలను వివరించారు.