నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్
TG: నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఇవాళ్టి నుంచి చికెన్ షాపులు మూతపడనున్నాయి. పాల్ట్రీ యజమానులు మార్జిన్ తగ్గించడం వల్ల తమకు నష్టాలు వస్తున్నాయని చికెన్ షాపు నిర్వహకులు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పాటు మహావీర్ జయంతి సందర్భంగా HYDలో మటన్, చికెన్ దుకాణాలను బంద్ చేయాలని GHMC అధికారులు ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.