VIDEO: మందపల్లి శనేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు
కోనసీమ: కొత్తపేట మండలం మందపల్లిలో కొలువైన శనేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహించారు. 2 నెలలకు గాను ఆలయ ప్రధాన హుండీల ద్వారా రూ. 6,52,578, అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. 74,079 ఆదాయం లభించిందని ఈవో దారపు రెడ్డి సురేష్ బాబు తెలిపారు. ఆలయ సిబ్బంది, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.