'ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి'

'ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి'

ASR: వర్షాల వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం జిల్లా ప్రజలకు సూచించారు. ఏపీ విపత్తుల సంస్థ సూచనల మేరకు పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండరాదన్నారు. సురక్షితమైన భవనాల్లో ప్రతి ఒక్కరూ ఆశ్రయం పొందాలని సూచించారు.