10 మంది మావోయిస్టులు లొంగుబాటు

10 మంది మావోయిస్టులు లొంగుబాటు

మధ్యప్రదేశ్ బాలాఘాట్‌లో 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సీఎం మోహన్ యాదవ్ సమక్షంలో వారంతా తమ ఆయుధాలను వీడారు. లొంగిపోయిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించిన వీరిపై రూ.2.36 కోట్ల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా తమతో పాటు ఏకే-47, ఇన్సాస్ రైఫిళ్లు సహా అత్యాధునిక ఆయుధాలను సైతం అధికారులకు అప్పగించారు.