ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం

కృష్ణా: నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలోని శ్రీ అన్నే రామకృష్ణయ్య జడ్పీ హైస్కూల్‌లో డిప్యూటేషన్‌పై సెకండరీ గ్రేడ్ టీచర్‌గా విధులు నిర్వర్తించిన రాధికకు పాఠశాల ఉపాధ్యాయ బృందం బుధవారం ఘన సన్మానం చేసింది. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. క్రమశిక్షణ, రామయ్య పాలన, అకుంఠిత దీక్షతో విధి నిర్వహణ రాధిక మేడం నుండి నేర్చుకోవాలన్నారు.