సమస్యల కేంద్రంగా మిర్యాలగూడ బైపాస్

SRPT: హుజూర్‌నగర్- లింగగిరి టూ మిర్యాలగూడ బైపాస్ రహదారి వివిధ సామాజిక, రవాణా సమస్యలకు కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో అక్రమ వ్యాపారాలు, మద్యం వినియోగం, అలాగే అక్రమ ఇసుక సరఫరా జరుగుతున్నాయి. బైక్ రేజర్లు వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. రహదారిపై విచ్ఛలవిడి అసాంఘిక కార్యకలాపాలకు, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.