DPR సిద్ధం.. ఆమోదమే మిగిలింది!

TG: రెండో దశ మెట్రో ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటెడ్ బోర్డ్ ఆమోదమే మిగిలి ఉంది. ఇది పూర్తి కాగానే DPRపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి ఆమోదించిన తర్వాత కేంద్రానికి పంపిస్తారు. JBS నుంచి మేడ్చల్, JBS నుంచి శామీర్ పేట వరకు కీలక మార్గాలను రెండో దశ 'B' భాగంలో ప్రతిపాదించారు. JBS వద్ద 30 ఎకరాల్లో మెట్రో హబ్ ఏర్పాటుకు ప్రణాళికలున్నాయి.