'ఆదోని సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకెళ్లా'

'ఆదోని సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకెళ్లా'

KRNL: ఆదోనిలో నెలకొన్న సమస్యలను మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లినట్లు టీడీపీ మాజీ ఇన్‌ఛార్జ్ గుడిసె కృష్ణమ్మ తెలిపారు. మంగళవారం లోకేష్‌ను కలిసి ఆదోనిని జిల్లాగా ప్రకటించడంతో పాటు నియోజకవర్గాన్ని 3 మండలాలుగా విభజించాలని కోరానన్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను తక్షణమే మెరుగుపరచాలని అభ్యర్థించానని తెలిపారు.