ఆర్థిక అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదు
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఆర్థిక అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనపై BRS కౌన్సిలర్లు , మున్సిపల్ కమీషనర్‌కి గురువారం ఫిర్యాదు చేశారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం ప్రజా ప్రయోజనాలను కాపాడాలని కౌన్సిలర్ లు కోరారు. పాత తీర్మానాలపై చేపట్టిన అన్ని పనులను నిలిపివేసి, ఆ టెండర్లను రద్దు చేయాలన్నారు.