గోపాలపురంలో కుక్కల పట్టివేత
E.G: గోపాలపురంలో వీధి కుక్కల బెడదను నివారించామని సెక్రటరీ అనురాధ, టీడీపీ నాయకుడు జ్యేష్ఠ శ్రీధర్ మంగళవారం తెలిపారు. కుక్కలను పట్టే సిబ్బందిచే వాటిని పట్టించి వ్యాన్‌లో తరలించామన్నారు. కుక్కల సమస్య పరిష్కారం అవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కాగా ఇటీవల గ్రామంలో చిన్నారులను ఈడ్చుకెళ్లి తీవ్రంగా దాడి చేసిన ఘటనలు అందరినీ కలచివేశాయన్నారు.