గ్రంథాలయ ఉద్యోగుల సమస్యలపై జేసీకి వినతిపత్రం

గ్రంథాలయ ఉద్యోగుల సమస్యలపై జేసీకి వినతిపత్రం

KKD: గ్రంథాలయ సంస్థల ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కాకినాడలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతిపత్రం అందించారు. పదోన్నతులు, పెన్షన్ల చెల్లింపు, పనివేళల మార్పు వంటి అంశాలపై వారు వినతి సమర్పించారు. దీనిపై స్పందించిన జేసీ రాహుల్ మీనా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు.