కట్టలేరుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని బైక్ ర్యాలీ
NTR: గంపలగూడెం కట్టలేరుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 27న సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరుగుతున్నట్లు మండల పార్టీ కార్యదర్శి మద్దిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ ర్యాలీ హీరాలి తోట మూల నుంచి తిరువూరు ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగి, ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజలు పాల్గొనాలని కోరారు.