మారమ్మ గుడి నిర్మాణానికి విరాళం అందజేసిన ఎంపీపీ
సత్యసాయి: పెనుకొండ మండలం సుద్ధపట్లపల్లి గ్రామంలో మారమ్మ గుడి దేవాలయ నిర్మాణానికి పెనుకొండ ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి రూ.10,000 విరాళం అందజేశారు. గ్రామ దేవాలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా శనివారం ఈ విరాళాన్ని గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.