పరీక్షా కేంద్రంలో కలెక్టర్ తనిఖీ
GDWL: విశ్వభారతి టెక్నో పాఠశాలలో పదో తరగతి పరీక్షల నిర్వహణను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాల్ ప్రాక్టీస్ లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించవద్దని ఆయన స్పష్టం చేశారు.