గంజాయి జోలికి వెళ్ళవద్దు: ఎస్సై
ASR: డుంబ్రిగూడ(మం) పెదపాడు గ్రామం, కొర్ర పంచాయతీలో పోలీసులు ఆదివారం CASO నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఎల్. సురేష్ ఆధ్వర్యంలో గ్రామంలోని కుటుంబాలను తనిఖీ చేశారు. పాత గంజాయి కేసుల్లో ఉన్న నేరస్తులను పరిశీలించారు. రికార్డులు లేని రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పండించడం, రవాణా చేయడం వంటి నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు.