ప్రజావేదిక స్టాళ్లను సందర్శించిన సీఎం
PLD: మాచర్ల పర్యటనలో శనివారం సీఎం చంద్రబాబు నాయుడు ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులు తయారు చేసిన చేతివృత్తి వస్త్రాలను పరిశీలించి, వారి ప్రతిభను అభినందించారు. కళాకారులకు ప్రభుత్వ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ప్రభుత్వ పథకాలను వివరించిన సీఎం, మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.