బుచ్చి అంగన్వాడీ కేంద్రంలో 'పోషణ్ పక్వాడా'

NLR: బుచ్చి పట్టణం ఖాజా నగర్‌లోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడి కార్యకర్త రాజమ్మ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ శకుంతల పాల్గొని బాలింతల 1000 రోజుల సంరక్షణ గురించి గర్భవతి, తల్లులకు వివరించారు. అనంతరం పౌష్టికాహారం గురించి తెలియజేశారు.