వినాయక మండపానికి అనుమతి తప్పనిసరి: డీఎస్పీ

BDK: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు కోత్తగూడెంలో వినాయక మండపల కమిటీ సభ్యులతో 1వ పట్టణ పోలీసులు స్టేషన్‌లో డీఎస్పీ అబ్దుల్ రహమాన్ సమావేశమయ్యారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ఈనెల 27న వినాయక చవితి పండగ ఉన్నందున ముందస్తుగా వాడ వాడలో పెట్టె వినాయకుడి మండపాలను, మండపం పెట్టడానికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు, అనుమతులను, నియమ నిబంధనలు వివరించారు.