అచ్చివెళ్లి గ్రామంలో మురుగు నీటి సమస్య.!
కడప: పులివెందుల మండలం అచ్చివెళ్లి సచివాలయం సమీపంలో మురుగు నీరు నిల్వ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీరు వీధుల్లో నిల్వ ఉండడంతో దుర్వాసన, దోమల పెరుగుదలతో ఆరోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు వాపోతున్నారు. పలుమార్లు అధికారులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.