జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
కృష్ణా: ప్రతి కుటుంబంలో కనీసం ఒకరు వ్యాపారవేత్తగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని జిల్లా కలెక్టర్ బాలాజీ అన్నారు. శుక్రవారం అవనిగడ్డ, నాగాయలంక, చల్లపల్లి మండలాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఆయన, స్వయం సహాయక సంఘాల మహిళలు DRDA –వెలుగు ద్వారా ఏర్పాటు చేసిన డ్వాక్రా యూనిట్లను పరిశీలించారు. లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు.