ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని ఏనుమాముల 100 ఫీట్ రోడ్డు శుభం గార్డెన్స్‌లో 3, 14, 43 డివిజన్ల మైనారిటీ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే KR నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మత సామరస్యం, సోదర భావాన్ని పెంపొందించేందుకు రంజాన్ ఇఫ్తార్ విందులు దోహదపడతాయని అన్నారు.