లబ్ధిదారుడి ఇంట్లో సీతక్క భోజనం

లబ్ధిదారుడి ఇంట్లో సీతక్క భోజనం

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి బియ్యం ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క బేగంపేట్‌లోని పాటిగడ్డలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి భోజనం చేశారు. ఆమెతో పాటు కాంగ్రెస్ మహిళా నాయకురాలు కోట నీలిమ ఉన్నారు.