మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: కలెక్టర్
సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందడుగు వేస్తుండటం శుభపరిణామమని పేర్కొన్నారు. వేదికపై ఉన్న మహిళా అధికారులే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగి వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాలని కోరారు.