ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ అవార్డులు
KRNL: ఆదోని మండలానికి చెందిన డిప్యూటీ ఎంపీడీవో కె.నాగరాజు, సెక్రటరీ జీ. శశికళను ప్రభుత్వం ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసింది. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఇవాళ జిల్లా కలెక్టర్ చేతుల నుంచి వీరు అవార్డులు అందుకోనున్నారు. 73వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది ఏప్రిల్ 24న ఈ వేడుక జరుపుకుంటారు.